VIBHATHA SANDHYALU

Original price was: ₹150.00.Current price is: ₹130.00.

“సాహిత్యానికి – ముఖ్యంగా కథాసాహిత్యానికి – మానవ సంబంధాలు ప్రత్యక్ష వస్తువు. మానవ సంబంధాలు సామాజిక సంబంధాల సజీవ రూపాంతరీకరణ. వాటిని వాటి మూలాల ప్రాతిపదిక మీద విడగొట్టడం సాధ్యం కాదు. పైగా సాహిత్యం సమాజాన్ని విశ్లేషించడం ద్వారా అర్థం చేసుకోదు, సృజనాత్మకంగా ప్రతిఫలించడం ద్వారా అర్థం చేసుకుంటుంది. అంతవరకు అదృష్టం. ఎందుకంటే ప్రతిఫలనం (సృజనాత్మకం అయినా కాకున్నా, ప్రతిభావంతం అయినా కాకున్నా) కనీసం విషయాన్ని ముక్కలు ముక్కలు చేయదు. తన దృష్టి పరిధిలో ఒక మొత్తంగానే చూస్తుంది. ఈ కారణంగా సాహిత్య ఆధ్యయనం సామాజిక శాస్త్రవేత్తలకు తమ పరిశోధనలో కోల్పోయిన సమగ్రతను కల్పించగలదు.”

– కె. బాలగోపాల్

“సమాజం రచయితల్లో పాఠకుల్లో విమర్శనాత్మక దృష్టిని కోరుకుంటున్న వర్తమాన సందర్భంలో సాహిత్య విమర్శను సామాజిక శాస్త్రాల అధ్యయనంతో అనుసంధానించిన ‘విభాత సంధ్యలు’(సంపా. సి.వి. సుబ్బారావు – సురా) అనే యీ చిన్న పొత్తం” 

– ఏకే ప్రభాకర్.

Categories: ,