Talaari

Original price was: ₹300.00.Current price is: ₹270.00.

కొన్ని హత్యలు నేరం కావు… అవి విధుల్లో భాగం. అచ్చంగా తలారీ సరవణ లాగా. నిజానికి అతను మనుషుల ప్రాణాలు తీస్తున్న ప్రతి సారీ మరణించాడు. ఈ విషయం ఇంట్లో తెలిసిపోతుందేమో అనుకుంటూ, తెలిసిన తరవాత భార్య మాటల్లో, కూతురూ, కొడుకుల తిరస్కారాల్లో మళ్లీ మళ్లీ ఉరికంబం ఎక్కుతూనే ఉన్నాడు. ఇది కేవలం మనుషుల ప్రాణాలు తీయటం గురించి కాదు. చట్టమూ, నైతికతా, ఆకలి, అవసరాల చేతుల్లో పదే పదే మరణించిన వాడి కథ. ఒకసారి తలారిని మన జీవితాలకి అన్వయించుకొని చూస్తే సరవణ మనలోనూ ఉన్నాడని అర్థమవుతుంది. తలారీ కేవలం ఉరితీసేవాడి కథ కాదు. నిత్యం మనకు బిగుసుకునే నైతికతల ఉరితాళ్ల కథ… ఈ కథ చదువుతున్నప్పుడు మన చుట్టూ ఉండే ఎన్నో ఉరితాళ్లు మనకు కనిపిస్తూనే ఉంటాయి… – నరేష్కుమార్ సూఫీ

Categories: , ,