SU Novella
Original price was: ₹150.00.₹130.00Current price is: ₹130.00.
ఈ చిన్న నవల నాయకుడు సు. నా ముందే బతికిన వ్యక్తి. అతనితో కలిసి పని చేశాను. కలిసి తిరిగాను, క్యాన్సర్ పరిశోధనలో నేను చిన్న మొక్కనైతే అతను పెద్ద మరిచెట్టు. నాకన్నా వయస్సులో చాలా పెద్దవాడు. సు ను నేను వెరుగు కళ్ళతో చూస్తుండేవాణ్ణి. చైనావాడైన ను ను చూసిన ప్రతిసారీ నాకు అతని దేశపు మహా యాత్రికుడు హ్యూయెన్ త్సాంగ్ గుర్తుకొచ్చేవాడు. ఇతనే అతనో, అతనే ఇతనో అనేటంతగా నా మనస్సులో హ్యూయెన్ త్సాంగ్ నిలిచిపోయాడు. సు ఆత్మీయత చూసి కొన్నిసార్లు ఇతను మా శివమొగ్గ జిల్లా బళ్ళిగానికి వచ్చాడా? అనే ప్రశ్న ఏర్పడేది. హ్యూయెన్ త్సాంగ్ తన జీవితపు మహోన్నత ఉద్దేశమైన బౌద్ధ ధర్మాన్ని అధ్యయనం చేయడానికి భారత్కు వచ్చాడు. అలాగైతే మెరికాలో స్థిరపడిన సు జీవిత ఉద్దేశమేమిటి? అతని జీవిత ఉద్దేశం ఏమైవుండేదో ఈ చిన్న నవలలో తెలుస్తుంది.
సు ఒక కర్మయోగిగా లేదా కాయక యోగిలా చాలామందికి స్ఫూర్తిగా నిలిచాడు. సదా లేబరేటరీలో ఏదో ఒక ప్రయోగం చేస్తూ కూర్చునేవాడు, అతను పేరు కోసమో, కీర్తి కోసమో పని చేసేవాడు కాదు. ఆ కారణం వల్లనే అతను ఆ క్యాన్సర్ వంశవాహినిని కనిపెట్టడానికి సాధ్యమైంది. గొప్ప వైజ్ఞానిక వ్యాసాలను తన సహవైజ్ఞానికులతో ప్రచురించటానికి అవకాశం దొరికింది.
- డా. ప్రసన్న సంతేకడూరు
Translator: Ranganatha Ramachandrao
Pages: 94
