Shridhara Banavasi

Shridhara Banavasi

శ్రీధర బనవాసి, సుప్రసిద్ధ కన్నడ రచయిత. శ్రీధర బనవాసి రచనలు అసాధారణ రీతిలో జీవితంలోని సరళత, సంక్లిష్టత రెండింటినీ చిత్రీకరిస్తాయి. ఆయన రాసిన ''అమ్మన ఆటోగ్రాఫ్' తెలుగులో అమ్మ ఆటోగ్రాఫ్ పేరుతో అనువాదమైంది. 'దేవర జోళిగె', 'బ్రిటిష్ బంగ్లె', 'జయంతిపురద కథెగళు' కథా సంకలనాలు, 'తిగరియ హూగళు', 'బిత్తిద బెంకి', పూర్ణచంద్రనిగె ముఖవాడవిల్ల' కవితా సంకలనాలు వెలువరించారు. ఆయన రాసిన 'బేరు' నవలకు కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కారం, కర్నాటక రాజ్య సాహిత్య అకాడెమి పురస్కారం, కువెంపు పురస్కారాలు లభించాయి. ఆయన 'ఫకీరా' అనే పేరుతో కూడా సాహితీలోకానికి పరిచయం.