Jyoti Pujari

Jyoti Pujari

జ్యోతి పూజారి ప్రసిద్ధ మరాఠీ రచయిత్రి, కథకురాలు, వ్యాసకర్త. మహారాష్ట్రలోని నాగపూర్లో జన్మించిన జ్యోతి పూజారి సామాజిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు.
ఇప్పటివరకు 8 నవలలు, 9 కథా సంకలనాలు, 2 వ్యాస సంకలనాలు, 5 జీవిత చరిత్రలు ప్రచురితమయ్యాయి. మహారాష్ట్రలో సస్పెన్స్, హర్రర్ కథలను రాసే ఏకైక రచయిత్రి. సామాన్య విషయాలను కాకుండా భిన్నమైన విషయాలను ఇతివృత్తంగా తీసుకుని నవలలు రాస్తుంటారు.
జ్యోతి పూజారి రాసిన నవలలకు, కథాసంకలనాలకు అనేక అవార్డులు, సన్మానాలు అందుకున్నారు. అందులో ఆమె మరాఠీలో రాసిన ఈ నవలకు విదర్భ సంఘ పురస్కారం (నాగపూర్), అంకుర సాహిత్య పురస్కారం (అకోలా), రసిక రాజ పురస్కారం (నాగపూర్) అందుకున్నారు. ఇదే నవల కన్నడ, గుజరాతి అనువాదాలకు కూడా పురస్కారాలు లభించాయి.