” మీరు కార్ల్ సేగన్ రాసిన బ్రోకాస్ బ్రెయిన్ చదివారా?”
” లేదు” అన్నాను.
” భలే సమాధానం!” అన్నారు బయటనుండి అటువైపుగా వెళ్తున్న త్యాగేశ్వరన్ స్వామి.
” ఒక పుస్తకాన్ని ఓడించటానికి మహా గొప్ప మార్గం ఈ ఒక్క మాటే.అది
పుంఖానుపుంఖాలుగా ఏం చెప్తే ఏంటి?
ఈ ఒక్కమాటను వినగానే ఆశ్చర్యంతో
నోరెళ్ళబెడతారు!”
‘ నెమ్మి నీలం’ పుస్తకం చదివారా? అంటే
చాలామంది చెప్పే సమాధానం బహుశా అదే!
” చదవలేదు”!
ప్రస్తుతం ఒక సినిమా గురించి మహోధ్రుతంగా చర్చలు జరుగుతున్నయ్.
అటా, ఇటా, ఎటూ అనే విషయంలో
ఎటో ఒకవైపు నిలబడేవారు కొందరైతే,
వ్యతిరేక పక్షంలో తక్కువ శాతమైనా
మరికొందరు!
వేల సంవత్సరాలుగా, పోనీ వందల
సంవత్సరాలుగా అణగారిన వర్గం
ఒకటుంది.వారినలా అణచివేతకు గురిచేసే వర్గం ముఖ్యంగా ఒకటే అందరికీ
కనబడుతుంది.ఆ వర్గం పేరు ఉదహరించటానికి అప్పుడూ,ఇప్పుడూ
భయమనేది ఉండదు ఎవరికీ.ఎందుకంటే
ప్రమాదం లేదు గనక.
. ‘ ఎక్కువశాతం అభ్యుదయ రచయితలు
రాసే రచనలే’ !
అంటే అందులో దళితులూ,వారిపై పీడనా
అదే ముఖ్య వస్తువు!
ఈ జయమోహన్ కథలలో కూడా అలాంటి కథలున్నయ్.మిగిలిన కథలకున్న గుర్తింపు వీటికి తక్కువ.
ఎన్ని సినిమాలు తీసినా,ఎన్ని రచనలు
వచ్చినా చివరిలో అగ్రవర్ణం వారికే విజయం.
” తంగలాన్” సినిమాలాంటి సినిమాలు
ఎన్ని తీసినా పరిష్కారమేంటో బోధపడదు.
‘ నేసమణి’ అనే వ్యక్తి ఒకప్పుడు ఉన్నాడు.ఇటీవలి కాలం వాడే!
ఇప్పుడు కలికానిక్కూడా దొరకడు.
ఎవడో ఒకడి మోచేతి నీళ్ళు తాగుతూ ఉండుంటాడు.
” ఆ ఉత్తరం చూశాక నేసమణి తిరునల్వేలి కలెక్టర్ తో మాట్లాడొచ్చు, లేదా పోలీసులతో సంప్రదించి వాళ్ళను
వెంటబెట్టుకుని రావచ్చేమో అని ఎదురు
చూశాడు నాన్న.కానీ ఉత్తరం పంపించిన
ఐదోరోజు మటుకు, ఒక డెబ్భయి,ఎనభైమంది జనాలు తెన్కాశినుండి బయలుదేరి,ఇలంజి
పట్టణంలోకి కొడవళ్ళు,బళ్ళాలూ పట్టుకుని దిగిపోయారు.”
” సింహానికి పుట్టావురా నువ్వు! మడం
ఏమాత్రం వెనక్కి తిప్పలేదు.మట్టిమనిషి
గట్టితనం, వాళ్ళకి రుచి చూపించావు.మనమేరా, మనకోసం
నిలబడి పోరాడాల్సింది!నువ్వు బయటకడుగెయ్! వేలెత్తే దమ్ములెవరికున్నాయో నేను చూస్తాను.”
ఈరోజుకీ దళితుల మీదే ముందుగా
అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నయ్?వారికి నచ్చిన పార్టీకి
ఓటేసుకునే హక్కు లేకుండా ఎందుకు పోతోంది?బట్టలూడదీసి తమ పార్టీవాడి
ఫొటోకి బలవంతంగా ఎందుకు మొక్కిస్తున్నారు?పబ్లిక్ గా వీడియోలు
తీసి ఎవరిని బెదిరించటానికి చూపిస్తున్నారు? వాళ్ళ వివరాలన్నీ అందులో ఉన్నా ఏ ఒక్కరూ ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు?
సినిమాల్లో జరిగిన అన్యాయాలూ,దోపిడీలూ బహిరంగంగా
జరుగుతున్నా ఎందుకు మాట్లాడలేక
పోతున్నారు?
ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మణులు కాదు!
వాళ్ళ జోలికిపోతే శవాలు కూడా గుర్తు
పట్టలేరు.
ఒక ఆడపిల్లమీద అత్యాచారం జరిగితే
అన్నం,నీళ్ళు మానేసి అల్లాడిపోయేవాళ్ళు
ఇంత విచ్చలవిడిగా హత్యలూ,దోపిడీలూ, మానభంగాలూ
జరుగుతుంటే చూస్తూ మూసుక్కూర్చుంటున్నారు.
ఏ చట్టం వాళ్ళమీద చర్య తీసుకోవటం లేదు కనకే వాళ్ళలా రెచ్చిపోతున్నారు.మీకేంకాదు మీ వెనక
మేం ఉన్నామని భరోసా ఇవ్వబట్టేకదా
వాళ్ళ ఆటలు అలా సాగుతున్నయ్!
‘ నెమ్మినీలం’ కథల పుస్తకంలో ఒక కథ
పేరు ” ఒగ్గనివాడు”.
ఇప్పుడు కావలసింది అలాంటి నేసమణి!
అంతేకానీ సోషల్ మీడియాలో సొల్లు
కార్చుకునే వాళ్ళుకాదు!
ఎవరైనా ‘ నెమ్మినీలం’ కథలు చదివావా?
అంటే లేదు అనకండి.అంతకన్నా ఆ
పుస్తకానికి జరిగే అవమానం మరొకటి
ఉండదు.
అలాంటి దళిత కథలే కాదు.
‘ అమ్మవారి పాదం’ కథలో అమ్మమ్మలూ,
నాయనమ్మలూ మీకు తెలిసేఉంటారు.
తండ్రిని పట్టించుకోలేదని మొగుడు తన
నెత్తిమీద ‘ అశుద్ధపు కుండ’ గుమ్మరించినా
కిమ్మనకుండా భరించిన ఆ తల్లిపాదం
భూమ్మీద ఆనితే ఎంత విపత్తు సంభవించేదో!’ ఈ గాత్రానికి ఈ విద్యకూ
ఆమె ఎలా ఉంటే ఏంటట?’ అని పిల్లని
చూడకుండానే ‘ ఈమె నా కోడలు’ అని
ఇంటికి తీసుకొచ్చి జీవితంలో ఎన్నడూ
గొంతు విప్పే అవకాశం ఇవ్వకపోయినా
సహించిన అమ్మవారు.
‘ధర్మం’ కథ మరీ అసందర్భంగా అనిపిస్తుందా?
కాదు!
విజయానికి దగ్గరిదారి కనుక్కున్నానని,
విర్రవీగుతూ కొంపలు కూల్చేవాడిని
” నా పొట్ట కొట్టావ్!నా పెళ్ళాం పిల్లల
ఉసురు పోసుకుంటావ్!నువ్వు నాశనమై
పోతావ్” అని శాపనార్ధాలు పెట్టేవాణ్ణి
చూసి నవ్వుతారు కానీ,జరగరానిది
జరిగి రోడ్డుమీద పడ్డప్పుడు వినబడే
మొదటిమాట!
” ఉసురు ఊరికే పోతుందా?”
చాలా పెద్ద కథలు అన్నీ.ఐనా విసుగుండదు.
‘ ఏనుగు డాక్టర్’ చాలమంది చదివిన కథ.
అలాగే ‘ వంద కుర్చీలు’.
ఇన్ని పేజీల పుస్తకం ‘ బౌండ్’ చేయించితే
బాగుండేది.ఎఁత జాగ్రత్తగా చదివినా
అట్ట నలిగిపోతోంది!
ps:- పిడుక్కీ,బియ్యానీకీ ఒకటే మంత్రం
లాగ ప్రతి దానికీ బ్రాహ్మలని తీసుకురాకండి.
మిమ్మల్ని తరిమి తరిమి కొడుతున్నదెవరో
తలకాయెత్తి చూడండి!