Description
తేరే బినా జిందగీ, లగ్ జా గలే తరువాత ఇది పరేశ్ పాటల వాఖ్యానాల్లో ఇది మూడవ పుస్తకం. మానవ జీవితం నుండి పాటను విడదీసి చూడలేం. అంతలా మనలో, మనతో మమేకమైంది పాట. తెలుగునాట కేవలం తెలుగు పాటలే గాక హిందీ పాటలకూ విపరీతమైన అభిమానులున్నారు. దాని భావంతో, అర్థం సంబంధం లేకుండా పదే పాడుకున్నారు. పాడుకుంటున్నారు. మళ్ళీ మళ్ళీ విన్నారు. వింటున్నారు. అయితే, ఈ పాటల అర్థం తెలిస్తే బావుండూ అనుకున్న వాళ్ళున్నారు. అర్థమైనా, వాటిని ఎవరైనా తెలుగు చేస్తే బావుండూ అనుకున్న వాళ్ళూ ఉన్నారు. పరేశ్ పాటలు వినడమే కాదూ పాడతాడు కూడా. అట్లా తాను పాడుకున్న పాటలను, ఆస్వాదించిన పాటలను ఇలా అనువాదం చేసి మనకు అందించాడు
Reviews
There are no reviews yet.