₹350.00 Original price was: ₹350.00.₹300.00Current price is: ₹300.00.
ఈ కథలు చదువుతుంటే మసలోకి మనం చూసుకుంటున్నట్లు ఉంటుంది. రచయిత మన గురించే రాశాడా అని అనుమానం వస్తుంది. నిజజీవితాల్లోని సంఘటనలు, సంఘర్షణలు, సంక్లిష్టతలు అక్షరాలుగా మారి కాయితాల్లోకి ప్రవహించాయా అన్న సందిగ్ధం ఏర్పడుతుంది. మనం నివసించే లోకంలో ఇన్ని కరడు గట్టిన (అ)ధర్మాలు కొనసాగుతున్నాయా? అనిపిస్తుంది. అక్కడక్కడ నల్ల మబ్బుకు వెండి అంచులా ‘మంచితనం’ మెరుస్తుంది. నేనున్నా భయపడకండి అని అభయమిస్తుంది. గుండెలకు హత్తుకుని ఓదారుస్తుంది.
ఇందులో ఏ ఒక్క కథా పాఠకుడిని నిరాశ పరచదు.
పైగా కొత్త ‘ఎరుక’ను సంతరించి పెడుతుంది. లోకాన్ని ఎలా చూడాలో? మనల్ని మనం ఎలా సంస్కరించుకోవాలో నేర్పుతుంది.
ఒక పుస్తకానికి ఇంతకన్నా సార్థకత ఏం కావాలి?
కొత్తగా అనువాద రంగంలోకి వచ్చేవారికి పాఠ్యగ్రంథంగా కూడా ఈ పరేశ్ కథలు ఉపకరిస్తాయని నా విశ్వాసం.
చంద్ర ప్రతాప్
పూర్వ సంపాదకుడు, విపుల – చతుర
ఇందులో ఏ ఒక్క కథా పాఠకుడిని నిరాశ పరచదు. పైగా కొత్త ‘ఎరుక’ను సంతరించి పెడుతుంది. లోకాన్ని ఎలా చూడాలో? మనల్ని మనం ఎలా సంస్కరించుకోవాలో నేర్పుతుంది. కొత్తగా అనువాద రంగంలోకి వచ్చేవారికి పాఠ్యగ్రంథంగా కూడా ఈ పరేశ్ కథలు ఉపకరిస్తాయని నా విశ్వాసం.