Donga Saara

Original price was: ₹150.00.Current price is: ₹120.00.
సాహిత్యం ఇలా ఉండాలి. ఇలా ఉండకూడదు, అని తెలుగు సాహిత్యంలో చాలా చర్చ జరిగింది. అవేవీ భారతిని చేరే అవకాశం లేదు. తెలుగు సాహిత్యం నుండి, తెలుగు సాహిత్య చర్చల నుండి భారతి ఏం నేర్చుకుందో తెలియదు. కాని తెలుగు సాహిత్యం, సాహితీవేత్తలు, పాఠకులు భారతి కతల నుండీ, నవలల నుండీ ఎంతో కొంత నేర్చుకున్నారనే అనుకుంటున్నాను. ఎప్పుడైనా తను కలిస్తే ఇదే మాట అని చూడండి. ఒక నవ్వు నవ్వి ఊరుకుంటుంది.
బతుకు రచనలో భాగమైనప్పుడు, బతుకే రచనయిప్పుడు దానికి ఏ ముసుగులు అక్కర్లేదు. ఏ నగిషీలు చెక్కనవసరం లేదు. అందమైన కవితాత్మక వాక్యాల మాటున వాటిని దాచాల్సినవసరం అంతకన్నా లేదు. మరి ఏం కావాలి? బతుకును బతుకులా పరిస్తే చాలు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ నవలలోలా.
సారాయి పుట్టుక నుండి అది వ్యసనమై, బతుకు విధ్వంసం చేయడం దాకా, దాని చుట్టూతా ఉన్న ఊరి ముచ్చటే ఈ దొంగ సారా.
 భారతి కతలు ఇంకా చదవలేదా! ఇదిగో ఈ పుస్తకం చేతిలోకి తీసుకుని చదవండి.
  – అరుణాంక్ లత
Categories: ,