Pacchi Maidaaku Vaasana
గోరింటాకు పులుముకున్న అరచేతుల వాసనలో మగ్గిన మాటలు ఇవి. ఎరుపు రంగులో ఎగసిన ప్రేమగీతాలు, నిశ్శబ్దంలో ఊపిరి పీల్చే కవితలు. వాన కురిసిన రాత్రి తడి కిటికీపై తాకిన వేళ్లలా, ఈ పదాలు మనసును తడిపిపోతాయి. ప్రతి పదం తడిసిన చర్మపు సుగంధంలా, ప్రతి అక్షరం ముద్దుల వెచ్చదనంలా రాలిపడుతుంది. అరుణాంక్ లత మాటల్లో ప్రేమ కేవలం అనుభూతి కాదు. అది చాయ్ కప్పు చప్పుడు, వాన తడి, మనసు తాకే నిశ్శబ్దం. తడిసిన గుండె పుటల మధ్య ఉండిపోయిన వాసన. పచ్చి మైదాకు వాసన. <b> – మాధురి పాలాజి <b>
అరుణాంక్ లత ప్రేమ మీద తన ఆకాంక్షల్నీ… ఆలోచనల్నీ… స్పందనల్నీ పంచుకున్న‘పచ్చి మైదాకు వాసన’ మనోదేహాల మోహ జుగల్ బందీ. ప్రేమంటే యేమిటనే అన్వేషకుల ఆంతరంగానికి తన మునివేళ్ళ కుంచెతో మైదాకుతో యెర్రబారిన పరిమళాన్ని అద్దిన తాత్వీకత. మబ్బులు వొంటిని తాకుతో పోయే కొండల్లో నిల్చునో కూర్చునో కాఫీ పరిమళాల సమక్షంలో ‘పచ్చి మైదాకు వాసన’ని చేతుల్లోకి తీసుకొంటూ వొకావొక మరపురాని అనుభూతి నింపుకొందాం. Come… relish, fall in love. <b> – కుప్పిలి పద్మ <b>

Welcome Back
Login to access your library.
By continuing, you agree to our Terms & Privacy Policy.
Your Cart
No products in the cart.



