ఇందులో నాన్న చనిపోయిన తర్వాత ఆయనకు కొల్లేరుతో ఉన్న అనుబంధాన్ని, నా అనుబంధాన్ని తలుచుకుంటూ రాసిన కవితలున్నాయి. అందరూ మెచ్చిన భూటాన్ పద్యాలు, ప్రొఫెసర్ సాయిబాబా మీద రాసిన కవితలు, నాన్న మరణానంతరం మా ఇంటి వద్దనే ఉన్న అమ్మను చూస్తూ రాసిన కవితలు ఇలా ఏవేవో ఉన్నాయి. చివరిలో అనువాద కవితలు ఇచ్చాను. నేను చేసిన అనువాదాల్లో కొన్ని ఎంపిక చేసి ఇచ్చినవి ఇవి. – ప్రసాద మూర్తి