Sale!

Jeevana Sandhya

Original price was: ₹200.00.Current price is: ₹160.00.

యువతరానికీ జీవనసంధ్యలో ప్రవేశించిన వృద్ధతరానికీ సునీత మునిమాపు సందేశంగా కాక ముదిగారపు సందేశంగా అందించారు, వృద్ధులలో విశ్వాస సూర్యోదయాలు కలిగించడంలో ఆమె నవలమయ్యారని, నేటి మన వృద్ధులలో “పరంధామయ్యలూ”, “శాంతమ్మ”లూ పడుతున్న మనోవేదనను అర్థం చేసుకోడానికీ యువ దంపతులకు ఈ నవల ఒక ‘టానిక్’గా పనిచేస్తుంది. నిజానికి జీవితంలో “తృప్తి”కి మించిన ఆస్తి లేదు, అలాగే “తృష్ణ”కు మించిన అనర్థము లేదు! నవలలోని వృద్ధుడు “పరంధామయ్య” కూడా “వృద్ధాప్యంలో మిగతా ఇబ్బందులుండవచ్చునేమోనని, ఆర్థికంగా మాత్రం ఎవరిమీద ఆధారపడకూడదనుకుంటూ” తృప్తిగా నిష్క్రమించే చివరి క్షణాలకోసం ఎదురుచూస్తాడు! అంతో ఇంతో స్థితిమంతుడుగా పరంధామయ్య స్నేహితుడు రామరాజు తానేదో “సాధించానన్న గర్వం” ఉన్నా కుటుంబం నుంచి మనశ్శాంతీ, స్వేచ్ఛలేక చివరికి వచ్చిన నిర్ణయం ఏమిటి? “ఇంతలా సంపాదించడమూ తప్పేమో అనిపిస్తోందిప్పుడు. పరిమితికి మించిన ఆశలు అప్యాయతల్నే చంపేస్తున్నాయి.

  • ఎ.బి.కె. ప్రసాద్

Author: Suneetha Ravulapally

Pages: 140

Category: