Manishi Lopala Needa
Original price was: ₹180.00.₹150.00Current price is: ₹150.00.
రెండు దశాబ్దాలకు పైగా కొనసాగిస్తూ వస్తోన్న రాజు గారి కథాప్రయాణంలో మీ చేతుల్లో వున్న యీ కొత్త కథాసంపుటి మరో చేర్పు. వీటిలో ప్రేమ కథలున్నాయి. కుటుంబ సంబంధాల్ని చర్చించే కథలున్నాయి. మానవ సంబంధాల్లో వస్తున్న మార్పుల్ని తెలిపే కథలున్నాయి. చుట్టూ వున్న మధ్యతరగతి జీవితాల్లోని ఆదర్శాలు వాటికి కలిగే విఘాతాలు వాటితో రాజీ పడుతూనో పోరాడుతూనో చేసే ప్రయత్నాలు… ఇటువంటి వస్తువులు రాజుగారి ‘దృష్టికోణం’ నుండి కథలుగా పరిణమించాయి. కథలో మనుషుల్లో మాయమౌతున్న విలువలు పట్ల ఆరాటం కనిపిస్తుంది. వాటిని నిలబెట్టుకోవాలనే తపన వ్యక్తమౌతుంది. ఈ సంపుటిలోని కథల్లో వెనకటి తరానికి చెందిన ఆదర్శవాదులున్నారు. కొత్త తరపు అవకాశవాదులున్నారు. వారి మధ్య విలువల సంఘర్షణ వుంది. అదే యెక్కువ భాగం కథల్లో అంతస్సూత్రమేమో. – ఎ. కె. ప్రభాకర్
Author: Datla Devadanam Raju
Pages: 160
