నెమ్మినీలం కథల పుస్తకంలోని అమ్మవారి పాదం కథ. ఎందుకో బాగా ఇబ్బందికి, అసహనానికి గురి చేసింది నన్ను.
ఆ తల్లి తరతరాల మౌనానికి, బరింపుకి ఆ పాదం నిదర్శనం.
భూదేవంత ఓర్పు స్త్రీకి అనే సొల్లు మాటలు వెనకాల ఎంత వివక్ష ఉంది.
గాలిలో నిలిపిన రెండో పాదాన్ని ఆమె దించితే?
ఏమై ఉండేది.!? అలా నిలపటం ఆమె.
అమ్మవారి పాదం ఒక మౌన వివక్ష.
ఆరేళ్లకే అద్భుతమైన సంగీతాన్ని ఆలపించిన బామ్మ కావేరి నది లాంటిది.
తాత తన సంగీతంలోకి కావేరి పాయను పట్టుకోగలిగాడు కానీ, నిండైన కావేరి నదిని కోల్పోయాడు.
ఎప్పుడో ఆ నదిని అశుద్దం చేశాడు. తొంభైమందికి గురువైతేనేం ఏంటికి ఉపయోగం. జీవితాన్ని తంబురా మీటినా అసలు సంగీతాన్ని పదేళ్లు గదిలో వేసి తేలుకుట్టి చంపుకున్నవాడు.
ఆ బీదతండ్రి కూతుర్ని చూడకనైనా వాకిటి ముందు నుంచే వెళ్లిపోతుంటే, తండ్రి గొంతు కోసం మౌనంగా చిట్టచివరి సంగీతం ఆలపించి ఉంటుంది ఆ అమ్మవారు.
ఇంటెద్దులాగా చాకిరీ చేస్తూ పూడుకుపోయిన ఆమె గొంతే రామన్ కంఠంలో మిగిలిపోయి ఉంటుంది.
అమ్మవారి నెత్తిన మలంతో అభిషేకం చేసిన సంగీత విద్వాంసుల కథ కూడా ఇది.
జయమోహన్ కి గొప్ప ఆగ్రహం ఉండి ఉంటుంది. కానీ ఆయన మనసు సముద్ర తరంగాల లాంటిది అయి ఉంటుంది.
అందుకే కథంతా ఒక ఆర్ద్రమైన మారుతం వీస్తూ ఉంటుంది.
దేవుడికి సమీపమైన సంగీతంలో కూడా కఠినత్వం ఉంటుంది.
మురికి ఉన్న సాహిత్యంపైన తేటైన నీరూ ప్రవహిస్తుంది.
అందుకే రామన్ బామ్మ కథని రాశాడు.