వాస్కోడగామా భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్న తర్వాత పోర్చుగీసు ప్రజలు, లిస్బన్ నగరవాసులు మనదేశం నుంచి సుగంధద్రవ్యాలు తీసుకొని వెళ్ళి యూరోప్ లో అమ్మి బాగా డబ్బు గడించే వారు. “తేజో తుంగ” నవల కథ పోర్చుగీసు రాజధాని లిస్బన్ లో, మనదేశంలోని విజయనగర సామ్రాజ్యంలోని తెంబకపురంలో జరుగుతుంది. రెండు ప్రేమకథలు సమాంతరంగా సాగుతాయి. లిస్బన్లో గాబ్రియల్ అనే Christian యువకుడు ఇసబెల్లా అనే యూదు యువతిని ప్రేమిస్తాడు. ఆమె ధనవంతుని బిడ్డ, ఆతను పేద యువకుడు. […]
