భిన్న పాత్రల్ని మన ముందుంచుతుంది ఈ నవల

అనేక నదులు ప్రవహించి సముద్రాన్ని చేరతాయి. సముద్రాన్ని చేరే చోటు దూరం నుంచి చూస్తే శాంతంగా, మనోహరంగా కనిపించినా, ఆ సంగమం మధ్యకెళ్లి చూసినప్పుడే నది సాగరాన్ని చేరేప్పటి కోలాహలం కనిపిస్తుంది. ఈ కథ జరిగే ఉత్తర కన్నడ కడలితీరంలోని ఈ ప్రజల జీవితాల్లోకి వెళ్తేనే వాళ్ళ కథ కూడా మనకు అలానే అనిపిస్తుంది. సాధారణంగా మనకి మనుషులపై మొదట్లో కలిగిన అభిప్రాయాలను మార్చుకోము, ఎందుకంటే ఆ అవకాశాలు మనకు చాలా అరుదుగా ఉంటాయి. మంచి అభిప్రాయాలు […]

మనసున గుబాళించే అత్తరు లాంటి కథలే

తెలుగు భాషలో రచనలే కాక ఇతర భారతీయ భాషల నుంచి తెలుగులోకి మంచి అనువాద రచనలు తరచు ప్రచురిస్తున్న ప్రచురణ సంస్థ ఛాయ ప్రచురణలు. ఇందులో ఆరు కథలు కథా సంపుటి శీర్షికలా చదివాక మనసున గుబాళించే అత్తరు లాంటి కథలే. మొదటి కథ అత్తరు నిజానికి అత్తరులా గుబాళించే ఓ ప్రేమలేఖ కథ. ప్రేమ కథలుంటాయిగానీ ఎవరు ఎవరికో రాసుకున్న ప్రేమలేఖకు కూడా ఇంత హృద్యమైన కథ ఉంటుందా? అని అడిగితే ఈ కథ చదివాక […]

కథావేదిక (తెలుగు రైటింగ్ వర్క్‌షాప్) – 2024​

ఛాయా – అజు పబ్లికేషన్స్ సంయుక్తంగా నిర్వహించిన ‘కథావేదిక – 2024’ను విజయవంతం చేసిన అందరికీ మా ప్రేమ చాల  మంది ఔత్సాహిక రచయితలు వస్తున్నా, తమ చుట్టూ ఉన్న అంశాలను కథలుగా చేయాలని అనుకుంటున్నా ఎలా చేయాలి? ఏది కథవుతుంది? అనే మీమాంస ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. అటువంటి వారి కోసమూ, ఇప్పటికే రాస్తున్న వారిని మరింత పదను పెట్టడం కోసం అజు, ఛాయ ప్రచురణ సంస్థల సంయుక్త నిర్వహణలో ఏర్పడిందే కథా వేదిక. ఈ […]

తేజో, తుంగభద్ర రెండూ రక్తాశ్రుధారలే…

గతమంతా తడిసె రక్తమున,కాకుంటే కన్నీళులతో…’గతం మాత్రమే కాదు, వర్తమానం కూడా అదే రక్తంలో, కన్నీళ్లలో తడుస్తున్నప్పుడు, మునిగిపోతున్నప్పుడు గత వర్తమానాల మధ్య ఎడతెగని సంభాషణ అయిన చరిత్రకు అర్థం ఏమిటి? చారిత్రక నవల రూపంతో వచ్చిన కళారూపపు వాస్తవ సారం రక్తాశ్రు రసాయనం కాదా? వసుధేంద్ర కొత్త నవల తేజో తుంగభద్ర రక్తాశ్రు రసాయనం రంగరించిన అద్భుతమైన కళారూపం. ఈ నవలకు చరిత్ర ఒక సాకు మాత్రమే. రచయిత కాలూనడానికి, పాత్రలకు స్థలకాలాల నేపథ్యం ఇవ్వడానికి ఒకానొక […]

Historical Fiction ఇష్టపడే వాళ్ళు తప్పకుండా చదవాల్సిన పుస్తకం

మనిషి అభివృద్ధి చెందుతున్నాడు. రోజురోజుకీ ఎన్నో కొత్త విషయాలను తెలుసుకుంటున్నాడు. కొత్తవి సృష్టిస్తున్నాడు. మరి మనిషి తన గురించి తాను తెలుసుకున్నాడా..!? శారీరికంగా,మేధోపరంగా కాకుండా మానసికంగా పరిణితి చెందేడా !?.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చరిత్ర మాత్రమే చెప్తుంది. ఐతే దేశ చరిత్ర తెలుసుకోవడం వల్ల కేవలం అప్పటి రాజకీయ పరిస్థితులు, సాంఘిక ఆచారాలు తెలుస్తాయి కానీ అప్పటి మానసిక స్థితి తెలిసే అవకాశం చాలా తక్కువ ఉంది. అలా తెలుసుకోవాలి అంటే కేవలం ఒక్క ప్రాంతం […]

ఎప్పుడో ఒకసారి ఇటువంటి నవల చదివే అవకాశం దొరుకుతోంది

ఎప్పుడో ఒక సారి ఇటువంటి నవల చదివే అవకాశం దొరుకతోంది. రష్యాలో చేకొవ్, గోగొల్, మరియు తుర్గురెవ్ ఎలాగైతే “ఫ్యామిలీ” అనే ఒక విషయాన్ని తీసుకొని దానిలో ఉన్న చిక్కులను, లోపాలను, ఇంకా వేరు వేరు భావర్ధాలను చెప్పారో, వివేక్ శ కూడా ఇక్కడ అలానే చెప్పారు. ఈ నవల చదువుతూనే ఏదో మా ఇంటి విషయమో లేక మనకు తెలిసినవారు విషయమో చదివినట్టు అనిపిస్తుంది. ఒక కుటుంబం మధ్య తరగతిలో బ్రతుకుతూ ఉంటే అక్కడ ఉండే […]

Incendies Stoning of Soraya

ఈ రెండు సినిమాలు నేను పీకల్లోతు మిడిల్ ఈస్ట్ సినిమాతో ప్రేమలో పడిపోవడానికి కారణాలు. ఆ తర్వాత ఎన్నో గొప్ప మిడిల్ ఈస్ట్ సినిమాలు చూసాను.అలా ఈ పుస్తకం చదివాక మరింతమంది స్త్రీల రచనలు చదవాలని నిర్ణయించుకున్నాను. నాకెందుకో వాస్తవం నుంచి , మానవ నిజ జీవితం నుంచి పుట్టిన కథలు పుట్టించినంత గగుర్పాటు,ఆనందం, ఆశ్చర్యం, కల్పిత లోకాల కథలు పుట్టించవు. అందుకే స్టార్ వార్ లు, అవతార్ లు నాకు నిదర తెప్పిస్తాయ్. Amores perros, […]