ఎప్పుడో ఒక సారి ఇటువంటి నవల చదివే అవకాశం దొరుకతోంది. రష్యాలో చేకొవ్, గోగొల్, మరియు తుర్గురెవ్ ఎలాగైతే “ఫ్యామిలీ” అనే ఒక విషయాన్ని తీసుకొని దానిలో ఉన్న చిక్కులను, లోపాలను, ఇంకా వేరు వేరు భావర్ధాలను చెప్పారో, వివేక్ శ కూడా ఇక్కడ అలానే చెప్పారు. ఈ నవల చదువుతూనే ఏదో మా ఇంటి విషయమో లేక మనకు తెలిసినవారు విషయమో చదివినట్టు అనిపిస్తుంది. ఒక కుటుంబం మధ్య తరగతిలో బ్రతుకుతూ ఉంటే అక్కడ ఉండే కష్టసుఖాలను ఎంతో రసవత్తరంగా ప్రస్తావించారు వివేక్. నేను ఏనాడూ ఇంత రసవత్తరంగా కుటుంబ విషయంలో ఉన్న నవల చదవలేదు.
డబ్బు వచ్చాక మనుషుల భావాలు మారుతాయని సత్యాన్ని మళ్ళీ ప్రస్తావించనవసంలేదు. వివేక్ ఇక్కడ ఒక కుటుంబ సమస్యలు కాక ఒక రకంగా మనిషియొక్క ప్రధాన “నేచర్” ని కూడా తెలుపుతున్నాడు. ఈ నవల కథకుడిని చూస్తుంటే మనకు ఎక్కడో తెలిసిన లేక చుసినవాడిలాగానే ఉన్నదనిపిస్తుంది. టీ.ఎస్. ఇలియట్ వ్రాసిన ఒక కావ్యంలో (the love song of J. Alfred Prufrock) కూడా మనిషి ఏమి తోచక ఎన్నెన్నో ఆలోచిస్తాడు. బెంగళూరు మరియు హైదరాబాదే కాదు ప్రతి చోట ఇదే పరిస్తితి. అదే విషయాన్ని వివేక్ చాలా చురుగ్గా విన్సెంట్ పాత్రతో చెప్పాడు.
నాకు అన్నిటికంటే నచ్చిన విషయం ఈ నవల ముగింపు విధానం. ఒక రకంగా “Open Ending” పెట్టారు వివేక్. ముగింపు తరవాత ఏమైనా జరగవచ్చు. కథకుడు పడే బాధ, అంతర్యుద్ధం, మరియు భావోద్వేగాలు మన మనసులోనూ ఎన్నో ప్రశ్నలను ఎత్తుతాయి.