మహేష్ రాతలను పుస్తకంగా తేవాలని చాలాకాలంగా అనుకున్నా ఆ అనుకోవడం ఇప్పటికి ఓ కొలిక్కి వచ్చింది. తను బ్లాగులో రాసుకున్న రాతలన్నీ కూరిస్తే దాదాపు 800 పేజీల వరకు వచ్చాయి అందులో మహేష్ రాసినవే గాక తనకు నచ్చి బ్లాగులో పెట్టినవీ ఉన్నాయి. వాటన్నిటినీ, మరికొన్ని తన వైయక్తిక అంశాల మీద రాసినవి తీసివేయగా… దాదాపు 500 పై చిలుకు పేజీలు వచ్చింది.
త్వరలోనే ‘కత్తి రాతలు’ మన చేతుల్లోకి.
ఇదే సందర్భంగా మహేష్ కీ, ఛాయకి ఉన్నస్నేహానికి గుర్తుగా ‘సాహిత్యంలో, ఫిల్మ్ క్రిటిసిజం’ లో రెండు అవార్డులను (ఒక్కోటీ 10 వేల రూపాయలు) ప్రతి యేటా ఇవాలని ఛాయ సంకల్పించింది. దానికి సంబంధించిన విధి విధానాలను త్వరలోనే ప్రకటిస్తాం.